Saturday, 19 June 2010

రమణ మహర్షి బోధనల ఆధారముగా మైకేల్ జేమ్స్ : స్వచ్చమయిన యథార్థ్యము గురించి

ఆనందమును (మన సహజ స్వభావమును) కోరుకోవటములో తప్పేమీలేదు. ఎలా అంటే మనకు తలనొప్పి వచ్చినప్పుడు, దాని నుండి ఉపసమనం కోసం ఆరాటపడతాము, ఎందుకంటే అది మన స్వభావము కాదు గనుక. అదే విధముగా మన స్వభావము కాని విషయాలు మనకు ఆనందమును కలిగించవు. అందుకే ఈ సంసారిక, తాత్కాలిక సుఖాలు మనకు పరిపూర్ణమైన ఆనందమును కలిగించలేవు. అవి అన్ని శాశ్వతము కావు, కావున మన స్వభావములు కావు.

కాబట్టి మన దేహము,ప్రపంచము,దేవుడు అన్ని తాత్కాలిక సత్యములు. పరిపూర్ణ మయిన సత్యము మన ఆత్మ ఒక్కటే. మన మనస్సు యెంత సత్యమో అదే విధముగా మన దేహము,ప్రపంచము,దేవుడు కూడా సత్యములే.

మనము మూడు అవస్తలలో (జాగ్రుతావస్త, స్వప్నావస్త, గాఢ నిద్ర) ఉన్నాము అని మనకు తెలుస్తూ ఉన్నది. కాని మన ఈ దేహము మనకు కేవలము జాగ్రుతావస్త లో ఉన్నట్టు తెలుస్తోంది (స్వప్నావస్తలో మనస్సు మరల మరో దేహమును సృష్టిస్తుంది కదా). కావున మనం దేహము అయ్యే ప్రసక్తే లేదు. అయితే మనము ఎవరు? మనము ఈ దేహమును తెలుసుకొనే వివేకము (ఆత్మ జ్ఞానము, consciousness) గా తెలుస్తోంది.

గాఢ నిద్ర, స్వప్న, జాగ్రుతావస్తలను గమనిస్తే, జాగ్రుత మరియు స్వప్నావస్తలలో మనము సుఖదుఖాలు రెంటిని అనుభవిస్తాము. కాని గాఢ నిద్రలో మాత్రం కేవలము ఆనందము ఉంటుంది. కనుక దుఃఖము అనేది మన స్వభావము కాదు అని తెలుస్తోంది. మనకు దుఃఖము లేకుండా జీవించగలము కావున అది మన స్వభావము కాదు. కనుక ఆనందముగా ఉండడము అనేది మన స్వభావము.

కాబట్టి ఈ ప్రపంచము,దేవుడు మన మనస్సు యెంత వరకు నిజమో అవి కూడా అంత వరుకు నిజము.మన మనస్సు కేవలము కల్పితము అని తెలుసుకున్నపుడు ఈ ప్రపంచము,దేవుడు కూడా మన మనస్సు కల్పించుకున్నవి అని అర్ధమవుతుంది.

మనకు ఆలోచనలు ఉన్నంతవరకు ఈ ప్రపంచము,దేవుడు అన్ని నిజాలుగా కనపడుతాయి. 'నేను దేహము' అనే భావన ఉన్నంతవరకు ఈ ప్రపంచము,దేవుడు,మన కర్మలు దాని యొక్క ఫలితములు కూడా నిజాలుగా కనపడుతాయి.

రమణ మహర్షి ఉల్లదు నార్పదు 38 శ్లోకం లో ఇలా అన్నారు

"మనమే మన కర్మలు చేస్తున్నాము అనే భావన ఉంటె దాని ఫలితము కూడా మనము అనుభవించాలి. కాని మనం "నేను ఎవరిని" అనే "ఆత్మ-విచారణ" చేసుకొని నిజముగా మనమే అన్ని పనులు చేస్తున్నామా అని ప్రస్నిన్చుకున్నపుడు
మన అన్ని కర్మలు వెళ్ళిపోతాయి.అల అన్ని బంధాలు నుంచి విముక్తి పొందడమే 'ఆత్మ-జ్ఞానము'

కాబట్టి మనకి మోక్షము ఏ పని చెయ్యటము వల్లన రాదు అని నిరూపించపడినది.

మన కలలో ఎలా ఐతే మన మనస్సు నూతన ప్రపంచమును సృష్టించి, నిజమని నమ్మిస్తుందో, అదే విధముగా మన జాగ్రుతావస్తలో కూడా మనము ఇప్పుడు చూస్తున్న ప్రపంచమును సృష్టించి, నిజమని నమ్మిస్తుంది. కావున మనము చూసే ఈ ప్రపంచమును కేవలము మన మన మనస్సు సృష్టించిన ఆలోచనలే తప్ప మరేమీ లేదని తెలుస్తుంది.

మనము ఎలా ఐతే జాగ్రుతావస్తలో మన జాగ్రుత దేహమును ఆత్మయని తప్పుగా అనుకుంటామో, అలాగే మనము స్వప్నావస్తలో కూడా మన స్వప్న దేహమును ఆత్మయని తప్పుగా అనుకుని అదే నిజమైన స్తితి అని భావిస్తాము. కాని నిద్ర నుడి లేవగానే స్వప్నము మన ఊహ,కావున అసత్యము అని తెలుస్తుంది. కావున దీని బట్టి మన మనస్సుకు ఈ ప్రపంచమును, దేహమును సృష్టించే, అదియే నిజమని నమ్మించే సామర్ధ్యము ఉంది అని తెలుస్తుంది.

జాగ్రుతావస్తలో మన మనస్సు ఈ ప్రపంచము అంత నిజము, స్వప్నావస్తలో ప్రపంచము అసత్యము అని చెప్తుంది. మరి అదే మనస్సు స్వప్నావస్తలో ఉన్నప్పుడు ఆ ప్రపంచమే నిజము అని చెప్తుంది కదా(మనం కలగనేటప్పుడు ఆ ప్రపంచము నిజమనే భావిస్తాము, కలలో సంతోషాలు, దుఖాలు అన్ని అనుభవిస్తాము). కాని జాగ్రుతావస్తలో కనీసము మనము ఈ విచారము చేయగలుగుతున్నాము, కనుక జాగ్రుతావాస్త స్వప్నావస్త కన్నా కొంచెం సత్యమునకు దగ్గరగా ఉన్నట్టు.

శ్రీ రమణ మహర్షి 'నాన్ యార్' 7 శ్లోకం లో ఇలా అన్నారు

మనం "నేను ఎవరిని?" అనే విచారణ మొదలుపెట్టినప్పుడు వేరే ఆలోచనలు వస్తాయి, అప్పుడు మనం వాటిని అనుసరించకూడదు. వచ్చే ప్రతి ఆలోచలని "ఎవరికి ఈ ఆలోచన వచ్చింది?" అని ప్రశ్నించుకోవాలి.ఇది సాధించాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇలా చేస్తే అందరు మనకి శివుడు(దేవుడు) లా కనబడుతారు.

రమణ మహర్షి 'నాన్ యార్' 15th శ్లోకం లో ఇలా రాసారు

దేవుడికి ఉద్దేశ్యము లేదు.అయన ఎటువంటి పనికీ బద్దుడై ఉండరు.ప్రపంచంలో జరిగే పనులు దేవుడిని ప్రభావితంచెయ్యవు. ఉదాహరణకు సూర్యుడు ఎటువంటి కోరిక, అవసరం , యత్నము లేకుండా ఉదయిస్తారు. ఒక్కసారి ఉదయించిన

అన్ని తారతమ్యము బాధలకి కారణము మన మనస్సు. సంపూర్ణమైన స్థితి మన ఆత్మ-జ్ఞానము పొందనంత వరకు రాదు.

Source: Happiness and The Art of Being Book
which is a layman’s introduction to the philosophy and practice of the spiritual teachings of Bhagavan Sri Ramana By Michael James

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. చాలా బాగుంది. "ఉల్లడు నారపాడు" కాదండీ "ఉల్లదు నార్పదు" అంటే ఉన్నది నలువది(నలభై) అని. చివరి పేరాలో matter మిస్సయ్యింది. గమనించగలరు.చాలా అచ్చుతప్పులు ఉన్నాయి.ఉదాహరణకు మీరు "జాగ్రుతావస్త" అని వ్రాశారు "జాగ్రదావస్థ" ఉండాలి. "జాగ్రుతావస్త" అనే పదానికి అర్థమే లేదు కదండీ. ఒక్కొక్కసారి అర్థమే మారిపోగలదు.

    ReplyDelete
  3. Hi,
    Visit my Blog : http://gsystime.blogspot.com/

    This is having spiritual and general society information.
    The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
    I written from 2009 December onwards.
    I wtitten in Telugu and English languages (In English few things are wrote).
    Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
    the title as symbol of '*').
    Main Topics are : (Read in order to better understand)
    Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
    Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
    Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
    Eng - (Jan, 2010) ' * How Brain Works'
    Eng - (Jan, 2010) ' * Where Dream World?'
    Eng - (Jan, 2010) ' * Why the Food?'
    Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
    Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
    Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
    Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
    Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
    Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
    Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
    Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
    Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
    Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
    Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
    Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
    chendavaa shwaasa neelone kadaa!" '
    Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
    "Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
    These two caption's so many written along with these.
    * * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
    letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
    lines : for Record).

    As soon as possible please give reply to my mail, about my Blog.

    Regards,
    Nagaraju G
    Contact : +91 9741005713 for any queries

    ReplyDelete
  4. Hi,కొత్త పుస్తకం 'నా భావనాలోచన' విడుదల (Jan 2011)
    blog : https://gsystime.blogspot.com
    It contains Universal knowledge and intents

    Thanks,
    Naaraju G
    9741005713

    ReplyDelete