Monday, 24 May 2010

రమణ మహర్షి : గాఢ నిద్రావస్త మెలుకువ స్తితి కన్నా వివేకమునకు (Consciousness) దగ్గరగా ఉంటుంది.

భక్తుడు : గాఢ నిద్రావస్త మెలుకువ స్తితి కన్నా వివేకమునకు (Consciousness) దగ్గరగా ఉంటుంది కదా?

రమణ మహర్షి : అవును. గాఢ నిద్ర నుంచి మెలుకువలోకి రాగానే నేను (I) అనే ఆలోచన మొదలు అవుతుంది. అప్పుడు మిగిలిన ఆలోచనలు కూడా మొదలు అయ్యి మన దేహము పని చెయ్యటము మొదలు పెడుతుంది. ఇవన్ని జరిగితేనే మనము మెలుకువగా ఉన్నట్టు, లేకపోతె మనము నిద్ర పోతున్నట్టు. అందుకే గాఢ నిద్రావస్త మెలుకువ స్తితి కన్నా వివేకమునకు (Consciousness) దగ్గరగా ఉంటుంది.

కాని అందుకని ఎప్పుడు నిద్రలో ఉండాలని కోరుకోకూడదు. మొదటగా ఎప్పుడు నిద్రలో ఉండడము అసాధ్యము. రెండవది నిద్ర అనేది జ్ఞానులు ఉండే అత్యున్నతమైన స్తితి కాదు. ఎందుకంటే అది శాశ్వతముగా ఉండక మారుతూ ఉంటుంది. కనుక నిద్ర అనేది జ్ఞానులు ఉండే అత్యున్నతమైన స్తితి కాదు.

నిద్ర అనేది ఆలోచనలకు, మనిషిపై వాటి ప్రభావములకు అతీతమైనది. మనము మార్చాలని అనుకున్నా మారనిది. అది మెలుకువ స్తితి కన్నా వివేకమునకు (Consciousness) దగ్గరగా ఉన్నా, అది జ్ఞానమును పొందుటకు సరియైన స్తితి కాదు.

Source: http://bhagwan-ramana-maharshi.blogspot.com/2009/02/ramana-maharshi-is-not-sleep-state.html

0 comments:

Post a Comment