Sunday, 30 May 2010

రమణ మహర్షి బోధనల ఆధారముగా మైకేల్ జేమ్స్ : మనస్సు యొక్క స్వభావము గురించి

మన కలలో ఎలా ఐతే మన మనస్సు నూతన ప్రపంచమును సృష్టించి, నిజమని నమ్మిస్తుందో, అదే విధముగా మన జాగ్రుతావస్తలో కూడా మనము ఇప్పుడు చూస్తున్న ప్రపంచమును సృష్టించి, నిజమని నమ్మిస్తుంది. కావున మనము చూసే ఈ ప్రపంచమును కేవలము మన మన మనస్సు సృష్టించిన ఆలోచనలే తప్ప మరేమీ లేదని తెలుస్తుంది.

మన మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది 'నేను' అనే ఆలోచన. దాని ఆధారముగా తర్వాత మిగిలిన ఆలోచనలను సృష్టిస్తుంది. ఆ 'నేను' అనే ఆలోచన లేనిదే మిగిలిన ఆలోచనలను అది సృష్టించలేదు.కనుక రమణ మహర్షి ఉపదేశ ఉండియర్ లో ఈ క్రింది విధముగా తెలిపినారు.

మనస్సు అంటే ఆలోచనల సముదాయము. ఆ ఆలోచనలన్నిటికి మూలము 'నేను' అనే ఆలోచన. కనుక మనస్సు అనేది 'నేను' అనే ఆలోచన తప్ప మరేమీ లేదు.

మనకు గాఢ నిద్రలో ఈ మనస్సు, దేహము ఉండవు. కాని మనము అప్పుడు కూడా ఉన్నాము. కనుక మనము ఎల్లప్పుడూ ప్రకాశించే స్వచమైన ఆత్మా.

మన దుఖములు అన్నిటికి కారణము, మనలను మనము దేహముగా అనుకోవటమే. ఈ కల్పిత భావనను విడిచి పెట్టగలిగితే మనము అన్ని ఆలోచనలను విడిచిపెట్టినట్టే. కాని ఈ భావనను ఎలా వదిలిపెట్టాలి? అసలు మనము ఎవరు అనేది తెలుసుకుంటే అప్పుడు మనకు ఈ భావన తొలగిపోతుంది. లేని పామును కర్రతో కొట్టి చంపలేము కదా. అక్కడ ఉన్నది ఏమిటి పామా లేక తాడ అని తెలుసుకుంటే, అప్పుడు నిజం బయట పడుతుంది. అలాగే మనము ఆత్మా విచారము ద్వారానే మనము ఈ దేహము కాదు అనే భావనను విడిచిపెట్టగలుగుతాము.

గాడ నిద్రలో కొంత సమయం ఉన్న తరువాత మన మనస్సు తన శక్తిని(recharge) మళ్ళి పూర్తిగా తెచ్చుకోగలుగుతోంది.

మన అన్ని ఆలోచనలకి కర్మలకి కోరికలే ప్రధాన కారణము.

మనకు ఎటువంటి ఆలోచనలు ఆలోచించుకోవడానికి కోరికలు లేనప్పుడు అప్పుడు మనం నిజానికి మన సహజ స్వభావం లోకి వెళ్లిపోతాము. రమణ మహర్షి "నేను ఎవరిని" అనే ఆలోచనలతో మిగతా ఆలోచనలు నాశనం అయిపోతాయి అని చెబుతారు .

మనస్సు(MIND) ఆలోచనలు యొక్క సంగ్రహము మాత్రమే.

మనస్సు ఆత్మలో ఉండే ఒక అద్భుతమైన శక్తి. మనస్సు వల్లే మనకు ఆలోచనలు మొదలు అవుతాయి.ఆలోచనలు మినహా మనస్సు అనేది ఇంక ఏమి కాదు.కాబట్టి అలోచన అనేది మనస్సు యొక్క తత్త్వం. మన ఆలోచనలు తప్ప ప్రపంచం అంటూ ఏమి లేదు. గాడనిద్రలో మనకి ఆలోచనలు ఉండవు కాబట్టి ప్రపంచము ఉండదు.మనం మెలుకువగా ఉన్నపుడు మరియు కలలు కనే టప్పుడు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రపంచము ఉంటుంది.

ఎలగయితే సాలెపురుగు బూజు దారాన్ని తనలోనుంచి బయటికి వదిలి మళ్లి వెనక్కు తెసుకుంటుందో, అలాగీ మన మనస్సు ఈ ప్రపంచాన్ని యుక్తి(చూపించి) చేసి తిరిగి తనలోకి వెనక్కి తెసుకుంటుంది.మనస్సు ఆత్మలో నుంచి బయటకి వచ్చినప్పుడు ప్రపంచం కనపడుతుంది. అందుకే మనం ప్రపంచం నిజమని భావించినప్పుడు ఆత్మ కనపడదు,ఆత్మ కనపడినప్పుడు ప్రపంచం కనపడదు.

మనస్సు ఆలోచనల సంగ్రహము. "నేను" అనే ఆలోచన ముందు మనస్సులో మొదలవుతుంది.ఎప్పుడు ఐతే మనం "నేను ఎవరిని?" అనే విచారణ మొదలు పెడతామో అప్పుడు అన్ని ఆలోచనలు ("నేను" అనే ఆలోచన) తో సహా తొలిగిపోయి కేవలం మన స్వచ్చమయిన ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది. అప్పుడు ఆత్మని దేహంతో మరియు మనస్సుతో పోల్చుకోవడం మానేస్తాము . కాని పయిన

చెప్పిన విచారణ అంత సులభం కాదు.

మనం "నేను ఎవరిని?" అనే విచారణ మొదలుపెట్టినప్పుడు వేరే ఆలోచనలు వస్తాయి, అప్పుడు మనం వాటిని అనుసరించకూడదు. వచ్చే ప్రతి ఆలోచలని "ఎవరికి ఈ ఆలోచన వచ్చింది?" అని ప్రశ్నించుకోవాలి.ఇది సాధించాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇలా చేస్తే అందరు మనకి శివుడు(దేవుడు) లా కనబడుతారు.

"నేను ఎవరిని?" అనే విచారణ తప్ప వేరే యోగ్యమైన మార్గాలు లేవు.శ్వాసని మనం జాగర్త గా అదుపులోకి తీసుకున్నపుడు మన మనస్సు కూడా ప్రసాంతంగా ఉన్నటు ఉంటుంది,కాని మళ్లి శ్వాస మీద పట్టు పోయినప్పుడు మన మనస్సు ఆత్మని వదిలి వెళిపోతుంది. ఊపిరికి,మనస్సుకి మూలాధారం ఒక్కటే.అలోచన మనస్సు యొక్క తత్వము.కాబట్టి శ్వాసని మనం జాగర్త గా అదుపులోకి

తీసుకున్నపుడు మన మనస్సు కూడా ప్రసాంతంగా ఉంటుంది.అలాగే మనస్సు ప్రసాంతంగా ఉన్నపుడు ఊపిరిని మనం అదుపులో పెట్టగలం.దేవుడి ఆజ్ఞ ప్రకారం మన గాడ నిద్రలో మనస్సు ప్రసాంతంగా ఉన్నా ఊపిరి పీల్చుకోవడం ఆగదు.అప్పుడు ఇతరులకి పడుకున్నవాడు బతికే ఉన్నాడు అనే భావన కోసం దేవుడు అలా చేసి ఉండవచ్చు.

ఊపిరి అదుపులోకి (control) చెయ్యడం కాకుండా దేవుడి మీద ధాన్యము,మంత్రములను పదే పదే చెప్పడం,ఆహార నియమాలు పాటించడం లాంటి కూడా మనస్సు ప్రసాంతంగా ఉండటానికి ఉపయోగ పడతాయి.అలా చెయ్యడం వల్ల మన మనస్సు కి ఏకాగ్రత వస్తుంది.

కాబట్టి మన మనస్సు తో ఎటువంటి జ్ఞానము పొందిన అది నిజమయిన జ్ఞానము కాదు.కేవలం 'అహం బ్రహస్మి' మాత్రమే నిజమయిన జ్ఞానము.

విచారణకర్త మరియు వస్తువు తాడు మరియు పాము లాంటి వారు. సాధారణముగా మనం తాడుని చూసి పాము అని భ్రమ పడతాము.ఎంతో జాగర్తగా చూస్తేనే మనకిఅక్కడ పాము లేదు తాడు మాత్రమే ఉంది అని తెలుస్తుంది.పాము లేదన్న తరువాతే మనకి తాడు ఉంది అని తెలుస్తుంది.అలాగే మనకి ఈ ప్రపంచము నిజం కాదుఅని తెలిసిన తరువాతే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది.

మనస్సు ఆత్మలో ఉండే ఒక అద్భుతమైన శక్తి. మనస్సు వల్లే మనకు ఆలోచనలు మొదలు అవుతాయి.ఆలోచనలు మినహా మనస్సు అనేది ఇంక ఏమి కాదు.కాబట్టిఅలోచన అనేది మనస్సు యొక్క తత్త్వం. మన ఆలోచనలు తప్ప ప్రపంచం అంటూ ఏమి లేదు. గాడనిద్రలో మనకి ఆలోచనలు ఉండవు కాబట్టి ప్రపంచముఉండదు.మనం మెలుకువగా ఉన్నపుడు మరియు కలలు కనే టప్పుడు

ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రపంచము ఉంటుంది.

ఎలగయితే సాలెపురుగు బూజు దారాన్ని తనలోనుంచి బయటికి వదిలి మళ్లి వెనక్కు తెసుకుంటుందో, అలాగీ మన మనస్సు ఈ ప్రపంచాన్ని యుక్తి(చూపించి) చేసితిరిగి తనలోకి వెనక్కి తెసుకుంటుంది.మనస్సు ఆత్మలో నుంచి బయటకి వచ్చినప్పుడు ప్రపంచం కనపడుతుంది. అందుకే మనం ప్రపంచం నిజమని భావించినప్పుడుఆత్మ కనపడదు,ఆత్మ కనపడినప్పుడు ప్రపంచం కనపడదు.

ఈ ప్రపంచం కేవలం మన ఆలోచన సంగ్రాహము మాత్రమే.ఆలోచనలు లేనప్పుడు మన మనస్సు ఆనందము పొందుతుంది.ప్రపంచము మళ్ళి వచ్చినప్పుడు మన మనస్సు దుఖం పొందుతుంది.

ఈ ప్రపంచము మన దేహము మీద ఆధారపడి ఉంది.మన దేహము వల్లే మనం ఈ ప్రపంచము చూడగలుగు తున్నాము. మన దేహము మన మనస్సు మీద ఆధారపడి ఉంది.ఎందుకు అంటే మన గాధ నిద్రలో మన మనస్సు ఉండదు అందువలన మన దేహము కూడా ఉండదు. మన మనస్సు మన ఆత్మ స్వభావం(sat-chit-ananda) మీద ఆధారపడి ఉంది.

Source: Happiness and The Art of Being Book
which is a layman’s introduction to the philosophy and practice of the spiritual teachings of Bhagavan Sri Ramana By Michael James

5 comments:

  1. ఇటువంటి ఆలోచనలను అజ్ఞానము అనేకంటే అపజ్ఞానము అనవచ్చు.

    ReplyDelete
  2. ajit kumar garu,

    mee comment ki dhanyavadamulu.

    meeku induloo yeevi ardamkaledu leka oppukovatledoo kasta vivarimchagalaru.

    ReplyDelete
  3. Hi,
    Visit my Blog : http://gsystime.blogspot.com/

    This is having spiritual and general society information.
    The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
    I written from 2009 December onwards.
    I wtitten in Telugu and English languages (In English few things are wrote).
    Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
    the title as symbol of '*').
    Main Topics are : (Read in order to better understand)
    Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
    Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
    Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
    Eng - (Jan, 2010) ' * How Brain Works'
    Eng - (Jan, 2010) ' * Where Dream World?'
    Eng - (Jan, 2010) ' * Why the Food?'
    Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
    Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
    Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
    Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
    Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
    Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
    Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
    Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
    Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
    Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
    Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
    Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
    chendavaa shwaasa neelone kadaa!" '
    Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
    "Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
    These two caption's so many written along with these.
    * * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
    letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
    lines : for Record).

    As soon as possible please give reply to my mail, about my Blog.

    Regards,
    Nagaraju G

    ReplyDelete
  4. who am i
    every time when i feal this first of all why i am present in this world this question will come to my mind

    ReplyDelete
  5. Hi,కొత్త పుస్తకం 'నా భావనాలోచన' విడుదల (Jan 2011)
    blog : https://gsystime.blogspot.com
    It contains Universal knowledge and intents

    Thanks,
    Naaraju G
    9741005713

    ReplyDelete