ఆనందము ఎవరి గురించి కోరుకుంటాము? మన గురించే కదా? మొదట మనము ఆనందముగా ఉండాలి అనుకుంటాము. మనము పరుల సంతోషము కోరుకున్నా, వారు సంతోషముగా ఉంటే మనకు ఆనందముగా ఉంటుంది అనేదే దాని వెనుక సత్యము.మనము చేసే ప్రతి పని మనకు ఏదో ఒక విధముగా సంతోషాన్ని ఇస్తుంది అనే ఆశతోనే చేస్తాము.మనము చేసే పనులు స్వార్ధముతో కూడుకున్నవి కావు అని అనుకున్నా, అవి మన సంతోషము గురించి చేసేవే. మనము మన కాలము, డబ్బు, సుఖసంతోషాలు, ఇంకా అతి విలువైనవి ఎన్నో వ్యచ్చించి ఇతరులకు ఏమైనా మంచి చేసినా, మరల వీటి వెనుక ఉన్న సత్యం మనము మనకు ఆ పనులలో ఆనందము కలగటమే. కనుక మనము ఏ పని చేసినా అది మన ఆనందము గురించే.
ఆనందముగా ఉండడము అనేది మన స్వభావము.కనుక ఆనందమును (మన సహజ స్వభావమును) కోరుకోవటములో తప్పేమీలేదు. ఎలా అంటే మనకు తలనొప్పి వచ్చినప్పుడు, దాని నుండి ఉపసమనం కోసం ఆరాటపడతాము, ఎందుకంటే అది మన స్వభావము కాదు గనుక. అదే విధముగా మన స్వభావము కాని విషయాలు మనకు ఆనందమును కలిగించవు. అందుకే ఈ సంసారిక, తాత్కాలిక సుఖాలు మనకు పరిపూర్ణమైన ఆనందమును కలిగించలేవు. అవి అన్ని శాశ్వతము కావు, కావున మన స్వభావములు కావు.
ఆనందము మన స్వభావము, దుఃఖము కాదు అని ఎందుకు అనుకోవాలి? ఆనందము మన స్వభావము అయితే మనము ఎల్లప్పుడూ ఆనందముగా ఎందుకు ఉండటంలేదు? దుఖాలు ఎందుకు కలుగుతాయి?
గాఢ నిద్ర, స్వప్న, జాగ్రుతావస్తలను గమనిస్తే, జాగ్రుత మరియు స్వప్నావస్తలలో మనము సుఖదుఖాలు రెంటిని అనుభవిస్తాము. కాని గాఢ నిద్రలో మాత్రం కేవలము ఆనందము ఉంటుంది. కనుక దుఃఖము అనేది మన స్వభావము కాదు అని తెలుస్తోంది. మనకు దుఃఖము లేకుండా జీవించగలము కావున అది మన స్వభావము కాదు. కనుక ఆనందముగా ఉండడము అనేది మన స్వభావము.
మనము ఆనందము దొరకక దుఃఖపడుతాము. అసలు ఆనందము అనేది లేకపోతే, దానిని పొందకపోతే కలిగే దుఃఖము కూడా లేదు. కావున సంపూర్ణ దుఃఖము అనేది లేనే లేదు. చాల దుఃఖములో ఉన్నప్పుడు కూడా మనలో ఆనందము ఒక చిన్న ఆశ రూపములో ఉంటుంది.
మనకు ఒక కోరిక తీరినప్పుడు వచ్చే ఆనందము కేవలము మనలో ఎల్లప్పుడూ ఉండే పరిపూర్ణమైన ఆనందములో ఒక చిన్న భాగము మాత్రమే. ఏదైనా కోరిక కలిగినప్పుడు మనలో ఆనందము మాయమయ్యి మరల ఆ కోరిక తీరిన వెంటనే ఆనందము కలుగును.
మన కోరికలను మనమే అదుపు చెయ్యలేము, ఎందుకంటే ఆ కోరికలకు మనమే కారణము, ఆధారము. మన మనస్సే ఈ కోరికలను సృష్టిస్తుంది, మరి అదే మనస్సు మన కోరికలను ఎలా నియంత్రించును? మనస్సును దాని మూలము అగు ఆత్మ వైపుకు తిప్పటమే కోరికలను అదుపు చెయ్యుటకు మార్గము.
మనము ఆత్మజ్ఞానము తప్ప మరే దానిమేదైనా ద్రుష్టి పెడితే మనస్సు పని చెయ్యటము మొదలు పెడుతుంది. మనస్సును దాని మూలము అగు ఆత్మ వైపుకు తిప్పిన యెడల కేవలము పరమానందము ప్రసాదించు ఆత్మ మిగులును.మనకు పరిపూర్ణ సంతోషము కలగాలంటే మనస్సును ఆత్మ వైపుకు తిప్పి దానిని నాశనము చెయ్యాలి. అప్పుడే మనము దుఖమును నాశనము చేసినట్టే.
శ్రీ రమణ మహర్షి : ఆనందము గురించి
పరమాత్మ యొక్క తత్వమే ఆనందముగా ఉండటం.ఆనందము,పరమాత్మ రెండు వేరు కాదు.ఈ ప్రపంచంలో ఏ వస్తువులోను మనకి నిజమయిన ఆనందం రాదు.మనకోరికలు సఫలం అయినప్పుడు మన మనస్సు ఆత్మలోకి వెళ్లి ఆనందము తెచ్చుకుంటుంది.ఇలా మన మనస్సు ఆత్మ నుంచి వెళ్లి వస్తూ ఉంటుంది.
చెట్టు నీడ కింద చాల హాయిగా ఉంటుంది;బయట ఎండగా ఉంటుంది.ఎండలో నుంచి చెట్టు నీడకి వచ్చిన వాడికి చాల ఆహ్లాదకరంగా ఉంటుంది.ఇలా తరుచు బయటికివెళ్లి మళ్ళి చెట్టు నీడకి వచ్చేవాడు అవివేకి.తెలివి గలవాడు ఎప్పుడు చెట్టు నీడ లోనే ఉంటాడు.వాస్తవానికి ప్రపంచం అనగా మన ఆలోచన మాత్రమే.ఆలోచనలులేన్నపుడు ప్రపంచము ఉండదు,అప్పుడు మన మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది;తిరిగి ఆలోచనలు మొదలు అయినప్పుడు మన మనస్సు బాధ పడుతుంది.ఇది మనం రోజు అనుభవిస్తాము.గాడ నిద్రలో చాల సంతోషంగా ఉంటాము అప్పుడు ఈ ప్రపంచము ఉండదు.
Source: Happiness and The Art of Being Book
which is a layman’s introduction to the philosophy and practice of the spiritual teachings of Bhagavan Sri Ramana By Michael James
Tuesday, 25 May 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment