Monday, 24 May 2010

రమణ మహర్షి : ఇంద్రియాలు మరియు దేహము గురించి

భగవాన్ : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు మీ దేహము గురించిన జ్ఞానము ఉంటుందా?

భక్తుడు : ఉండదు.

భగవాన్ : మరి నీకు దేహము గురించి గాఢ నిద్రలో తెలియకపొతే, దేహము నిద్రావస్తలో ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నావు?

భక్తుడు : ఎందుకంటే నేను నిద్ర మేలుకున్న తరువాత మరల నేను దేహమును చూడగలుగుతున్నాను కాబట్టి.

భగవాన్ : దేహమును తెలుసుకోవటము అనేది కూడా ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన మనస్సు నుంచి వస్తుంది. మొదట నేను అనే ఆలోచన వస్తుంది, ఆ తర్వాత మనస్సు నిద్రలేస్తుంది. కనుక నేను అనే ఆలోచనే అన్నిటికి మూలము. దానిని గనక పట్టుకోగలిగితే మిగిలిన ఆలోచనలు అన్ని మాయమయిపోతాయి. అప్పుడు దేహము ఉండదు, మనస్సు ఉండదు, అహంకారము ఉండదు.

భక్తుడు : అప్పుడు ఏమి మిగులుతుంది?

భగవాన్ : కేవలము స్వచ్చమైన ఆత్మజ్ఞానము మాత్రమే మిగులుతుంది.

Source: Talk 244

0 comments:

Post a Comment