భక్తుడు : ముక్తి మరియు జ్ఞానము ఒకటేనా.
రమణ మహర్షి : ముక్తి అనేది మన స్వభావము. మనకి అది మరో పేరు. మరల మనము ముక్తిని కోరుకోవటం అనేది హాస్యాస్పదము. అది ఎలా ఉంది అంటే నీడలో ఉన్న మనిషి, నీడను వదిలి ఎండలోకి వెళ్లి, అక్కడ ఎండ తీవ్రత గ్రహించి మరల చాల కష్టపడి నీడలోకి వచ్చి "ఆహా! నీడలో ఎంత హాయిగా ఉంది. చివరకు నీడను చేరుకోగలిగాను." అని ఆనందించుట వంటిది.
మనము అందరము అదే పని చేస్తున్నాము. ముక్తి మన నుండి వేరుగా లేదు. కాని మనమే దానిని వేరుగా ఏదో ఉంది అని ఊహించుకుని, భేద భావములు ఏర్పరచుకుని, చాలా కష్టపడి ఆత్మజ్ఞానము సాధించుకుని మరల ఆ భేద భావములను తొలగించుకుని ముక్తి మన నుండి వేరుగా లేదు అనే విషయము తెలుసుకుంటాము. మరి ఈ భేద భావములను ఏర్పరచుకోవటము ఎందుకు మరల దానిని తొలగించుకోవటము ఎందుకు?
Source: http://bhagwan-ramana-maharshi.blogspot.com/2009/02/ramana-maharshi-is-mukti-same-as.html
Saturday, 22 May 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment