రమణ మహర్షి :బ్రహ్మ బ్ఞానం అంటే మనం కొత్తగా పొందవలసినది ఏమి లేదు. ఏ పరమాత్మ మనం పొందాలి అని అనుకుంటున్నామో అది నిజానికి మనమే. నిజానికి ఎల్లప్పుడు ఆనందముగా ఉండటం మన స్వభావం.ఎలాగయితే "పది అవివేకులు" లెక్కపెట్టుకోవడం రాక ఒకడు తప్పిపోయాడు అని అనవసరపు బాధ పడ్డారో అలాగే మన అవివేకము వల్లే మనం బాధలో ఉన్నటు అనుకుంటాము.
మీకు ఆ "పది అవివేకుల" కధ చెప్పాలి.
"పది మంది అవివేకులు" యాత్రకి బయలుదేరుతారు. యాత్ర మద్యలో అందరు ఉన్నారా లేదా అని ఒకరు అందరిని లేక్కపెడుతారు.లెక్కపెట్టే టప్పుడు తనను తాను లేక్కపోట్టుకోక మిగిలిన వాళ్ళ అందరిని లేక్కపెడుతారు."తొమ్మిది" మందే ఉన్నారు అని తప్పుగా అనుకోని తను బాధ పడుతూ అందరిని బాధ పెడతాడు.మరి ఒకరు తను కూడా ఒక్కసారి లేక్కపెడదాము అని అనుకొని మల్లె అలాగే తప్పుగా లెక్కపెట్టి "తొమ్మిది" మందే ఉన్నారు అని చెప్పి బాధ పడతాడు.
అప్పుడు వీళ్ల బాధ చూసి ఎవరో ఒక జ్ఞాని వాళ్ళ తప్పుని చెప్పుతాడు. అప్పుడు ఆ "పది మంది అవివేకులు" వాళ్ళ తప్పుని తెలుసుకొని ఆనందముగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి ఈ పది మంది కొత్తగా నేర్చుకుంది ఏదయినా ఉందా? వాళ్ళ అవివేకము వల్ల వాళ్ళు తప్పిపోయాడు అని అనుకొన్న "పదొవ మనిషి" ఎప్పుడు అక్కడే ఉన్నాడు.
అలాగే మీ యొక్క అవివివేకము వల్లే మీరు బాధలో ఉన్నటు అనుకుంటున్నారు.నిజానికి మీకు పరమాత్మకు తేడ ఏమి లేదు.మనమే అనోసవరపు నిభందనలు పెట్టుకొని బాధ పడుతూ ఉంటాము.
మన అవివేకమీ మన బాధలకి కారణము.అవివేకము వదిలి ఆనందముగా ఉండమని చెప్పేదే బ్రహ్మ జ్ఞానము.
Source: http://bhagwan-ramana-maharshi.blogspot.com/2009/02/ramana-maharshi-brahma-jnana-is-not.html
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment