భక్తుడు: జ్ఞాన మార్గము లోకి కొత్తగా వచ్చిన భక్తుడికి మీరు ఇచ్చే సందేసము ఏంటి?
రమణ మహర్షి: మనస్సు ఆలోచనల సంగ్రహము. "నేను" అనే ఆలోచన ముందు మనస్సులో మొదలవుతుంది.ఎప్పుడు ఐతే మనం "నేను ఎవరిని?" అనే విచారణ మొదలు పెడతామో అప్పుడు అన్ని ఆలోచనలు ("నేను" అనే ఆలోచన) తో సహా తొలిగిపోయి కేవలం మన స్వచ్చమయిన ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది. అప్పుడు ఆత్మని దేహంతో మరియు మనస్సుతో పోల్చుకోవడం మానేస్తాము . కాని పయిన చెప్పిన విచారణ అంత సులభం కాదు.
మనకు ఎన్ని ఆలోచనలు వచ్చిన పరవాలేదు.ప్రతి ఆలోచన వచ్చినప్పుడు ఎవరికి ఈ ఆలోచన అని మనము ప్రస్నించుకోవాలి? అప్పుడు మనకే అని అర్ధమవుతుంది.అప్పుడు మనం "నేను ఎవరిని?" అనే విచారణ మొదలు పెట్టినప్పుడు మనస్సు అత్మలోనికి
వెళిపోతుంది.
"ఇది నేను సాధించగలన?" అనే సందేహం వదిలి అందరు మన ఆత్మ మీద ధ్యానం చేసుకోవాలి.ఒకవేళ ఒకరు యెంత పాపాత్ముడయినా గుర్తుచేసుకుంటూ బాధపడకూడదు.అసలు "నేను పాపాత్ముడు" అనే ఆలోచనను పక్కన పెట్టేసి ఆత్మ మీద ధ్యానం చేసుకోవాలి.అప్పుడు తప్పకండ అందరు సాదించగలరు. మనస్సులు రెండు ఉండవు - ఒకటి మంచి;ఒకటి చెడు లాగ.మనస్సు ఒక్కటే. దాన్ని చిహ్నలే రెండు - సుభమయినది మరియు అశుభమయినది.మన మనస్సుకి సుభమయిన చిహ్నలు ఉంటే అది మంచి; అలాగే మన మనస్సుకి అసుభమయిన చిహ్నలు ఉంటే అది చెడ్డది.
ఎలాగయితే ముత్యం కోసం సముద్రం లోతు వరకు వెళ్లి వెతుకుతామో అలాగే అందరం మనలోని ఆత్మ-జ్ఞానము పొందాలి.
రోజుకి ఒకటి లేక రెండు గంటలు సమాధిలో ఉంటె సరిపోతుంది.దాని యొక్క ఫలితము రోజు మొత్తం కనిపిస్తుంది.
Source : from the book "Be As You Are"David Godman
Sunday, 2 May 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment