Sunday, 18 April 2010

రమణ మహర్షి : ఉద్రేకములు (passions) ఎలా తగ్గించుకోవాలి గురించి

భక్తుడు: నా ఉద్రేకములు (passions) ఎలా తగ్గించుకోవాలి ?

రమణ మహర్షి : ఉద్రేకములు యొక్క మూలము తెలుసుకుంటే చాలు. అయినా ఉద్రేకములు అంటే ఏంటి? కామము,క్రోధము... మొదలయినవి కదా. అవి ఎందుకు వస్తాయి? ప్రపంచము లో కొన్ని వస్తువులు మీద మన ఇష్టాలు కొన్ని వస్తువులు మీద అసహ్యము ఉండటము వలన. అందుకే ఆత్మ జ్ఞానము ఉంటె ఇటువంటి సమస్య ఉండదు మరియు ఉద్రేకములు (passions) వచ్చే అవకాసము ఉండదు.

ఉద్రేకములు ఎందుకు వస్తాయి? మనం ఆనందముగా ఉండాలి అనే కోరిక కలగటం వలన. ఆనందముగా ఉండాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటె అది మన స్వభావము కాబట్టి.

కోరికలు తృప్తి పరచడం వళ్ళ తగ్గవు.ఆ విధముగా తగ్గించడం అంటే మండే నిప్పులో పెట్రోల్ పోసినట్టే.అలా అని చెప్పి కోరికల్ని అణచడం కూడా మంచిది కాదు.ఎందుకంటె కోరకల్ని అణిస్తే అవి మళ్ళి పుట్టే అవకాసము ఉంది. కాబట్టి ఆత్మ-విచారణ సరియిన మార్గము.

ఉద్రేకములు తగ్గించుకోవడానికి "ఆహార నియమాలు", "ఉపవాసము ఉండటము" , "యోగ సాధన చెయ్యడము" , "మందులు(ఆయుర్వేదం) వాడటము" కూడా కొంత వరకు ఉపయోగ పడతాయి.కాని వాటి ప్రయోగానము తాత్కాలికము. సరిఅయిన మార్గము వాటిని తొలగించడమే. అది ఆత్మ-విచారణ తో మాత్రమే సాధ్యపడుతుంది.

Source: http://bhagwan-ramana-maharshi.blogspot.com/2009/01/ramana-maharshi-teachings-on-overcoming.html

0 comments:

Post a Comment