Sunday, 25 April 2010

రమణ మహర్షి: దేవుడు, దేవుడు యొక్క సంకల్పము గురించి

భక్తుడు: ఈ ప్రపంచమునకు దేవుడికి సంబంధము ఎటువంటిది?

రమణ మహర్షి: దేవుడికి ఉద్దేశ్యము లేదు.అయన ఎటువంటి పనికీ బద్దుడై ఉండరు.ప్రపంచంలో జరిగే పనులు దేవుడిని ప్రభావితం చెయ్యవు. ఉదాహరణకు సూర్యుడు ఎటువంటి కోరిక, అవసరం , యత్నము లేకుండా ఉదయిస్తారు. ఒక్కసారి ఉదయించిన తరువాత ఈ భూమి ఫై ఎన్నో పనులు జరుగుతాయి: తామర పువ్వు విచ్చుకుంటుంది , నీరు ఆవిరి అవుతుంది,ప్రతి ప్రాణి తమ పనులను ఆరంభిస్తారు.

కాని సూర్యుడు పైన చెప్పిన యే పనుల వలనా ప్రభావితం కారు.ఎటువంటి ఆవశ్యకత లేక ఆయన స్వభావము బట్టి నడుచుకుంటూ జరిగే పనులకు శాక్షి గా ఉంటారు. ఎవరు చేయు కర్మకు వాళ్ళే బాద్యులు కాని దేవుడు కారు.అయన చేసీ యే పని కీ బద్దుడై ఉండరు.

భక్తుడు: సంసారము ఎందుకు మనకి కష్టాలు, బాధలు ఉంటాయి?

రమణ మహర్షి: దేవుడి యొక్క అభీష్టము వలన.

భక్తుడు: దేవుడు ఎందుకు అల రాసారు?

రమణ మహర్షి: ఎవరు చేయు కర్మకు వాళ్ళే బాద్యులు కాని దేవుడు కారు.అయన చేసీ యే పని కీ బద్దుడై ఉండరు.

భక్తుడు: అన్ని పనులు ప్రపంచములో దేవుడు వల్లనే అవుతాయా?

రమణ మహర్షి: దేవుడి అనుగ్రహం లేకుండా ఎవరికి ఏ పని చెయ్యలేరు.కాబట్టి దేవుడి పాదాలు దెగ్గర మౌనంగా ఉండటం ఉత్తమము.మనస్సుని దేవుడి మీద లగ్నము చెయ్యడం ఉత్తమము.

భక్తుడు: ఈశ్వరుడు అనే ఒక దేవుడు ఒకరు ఉన్నారా?

రమణ మహర్షి: అవును.

Source: http://bhagwan-ramana-maharshi.blogspot.com/2008/12/ramana-maharshi-on-god-will-of-god.html

0 comments:

Post a Comment