భక్తుడు : దుఖాల నుంచి ఎలా తప్పించుకోగలము?
రమణ మహర్షి: ఎల్లప్పుడూ ఆత్మ జ్ఞానముతో కేవలము ఆత్మనే ఆదరించాలి. శరీరము మరియు మనస్సును ఆదరించవద్దు. మనము అంటే శరీరము మరియు మనస్సు అనుకోవటమే దుఃఖము. మనస్సు లోతుల్లోకి వెళ్లి నువ్వు ఎవరో తెలుసుకోవాలి. ఇలా మనను మనము శరీరము మరియు మనస్సుగా తప్పుగా అనుకోవటం మాని, నువ్వు ఆత్మవి అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము.
భక్తుడు : శాస్త్రవేత్తలు ఆకాశములో వేగముగా ప్రయాణము చేయగల విమానమును కనిపెట్టారు. అలాగే మీరు కూడా మాకోసం జ్ఞానమార్గం లోకి తీసుకువెళ్ళగల విమానము ఒకటి కనిపెట్టవచ్చు కదా.
రమణ మహర్షి: అదే ఆత్మవిచారము. అదే మీకు కావలసిన జ్ఞానమార్గం లోకి తీసుకువెళ్ళగల విమానము. అది చాలా సరళమైనది, వేగము కలది మరియు చాలా తేలికైనది. మీరు ఇప్పటికే చాలా వేగముగా ఆ దిశగా ప్రయాణిస్తున్నారు. కాని మన మనస్సు వలన మనము జ్ఞానమార్గంలో ముందుకు వెళ్ళటం లేదు అని అనిపిస్తుంది. పూర్వకాలములో రైళ్ళు వచ్చిన కొత్తల్లో, అందులో ప్రయాణించే వారు బయట ఉన్న చెట్లు, ఇళ్ళు కదులుతున్నాయి కాని మేము కాదు అని అనుకునేవారు. అలాగే మీరు కూడా.
మన మనస్సే మనము జ్ఞానమార్గంలో ముందుకు వెళ్ళటం లేదు అని మనను నమ్మేట్టు చేస్తుంది.
Source: from David Godman Book "Living by the Words of Bhagavan"
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment