Sunday, 28 March 2010

రమణ మహర్షి : ప్రపంచంలో బాధ గురించి

భక్తుడు: ప్రపంచంలో బాధ చూస్తున్నాము.మనిషి ఆకలి తో బాధ పడుతున్నాడు. దీన్ని మొత్తం కూడా కలగా అనుకొని బాధ పడకూడదా ?

రమణ మహర్షి: జ్ఞానీ యొక్క ఉద్దేశంలో తప్పకండా మీరు చెప్పేది అంత కల మాత్రమే.మన కలలో కూడా మనం ఆకలితో బాధ పడతాము మరియు ఆకలితో బాధ పడే వారిని చూస్తూ ఉంటాము. మన కలలో కూడా మనం ఆకలితో బాధ పడి నప్పుడు స్వప్న-ఆహారం పెడతాము. రెండు (స్వప్నం,మెలుకువ) స్థితిలను ఎప్పుడు కలపకూడదు.

కాని,మనకి ఆత్మ జ్ఞానము వచ్చేటంత వరకు మనము ప్రజలకు సేవ చెయ్యాలి.అదికూడా అహంకారము లేకండా ఆపేక్ష లేకుండా చెయ్యాలి.

అలాగే మనం దేవుడి యొక్క సాధనము అని అనుకోవాలి.అలాగే సేవ చేసేవాళ్ళని తక్కువగా చూడకుండా సమానంగా చూడాలి.సేవ చేసే అతనిలో దేవుడిని చూడాలి.నిజానికి ఎదుటి వాళ్ళకి సేవ చెయ్యటం అంటే మనకు మనమే సేవ చుసుకున్నటే.

Source: From The Teachings of Sri Ramana Maharshi Edited by David Godman

0 comments:

Post a Comment