Saturday, 20 March 2010

రమణ మహర్షి యొక్క కొన్ని ఉదాహరణములు

దురదుష్టము అంటె ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవడం. అంటె మన మనస్సుని ఆత్మలో నుంచి తొలగించినట్టే.

నిజమయిన భక్తి అంటె మన అహంకారము అత్మలోనికి అప్పగించడమే.

"ఇది నేను సాధించగలన?" అనే సందేహం వదిలి అందరు మన ఆత్మ మీద ధ్యానం చేసుకోవాలి.ఒకవేళ ఒకరు యెంత పాపాత్ముడయినా గుర్తుచేసుకుంటూ బాధపడకూడదు.అసలు "నేను పాపాత్ముడు" అనే ఆలోచనను పక్కన పెట్టేసి ఆత్మ మీద ధ్యానం చేసుకోవాలి.అప్పుడు తప్పకండ అందరు సాదించగలరు. మనస్సులు రెండు ఉండవు - ఒకటి మంచి;ఒకటి చెడు లాగ.మనస్సు ఒక్కటే. దాన్ని చిహ్నలే రెండు - సుభమయినది మరియు అశుభమయినది.మన మనస్సుకి సుభమయిన చిహ్నలు ఉంటే అది మంచి; అలాగే మన మనస్సుకి అసుభమయిన చిహ్నలు ఉంటే అది చెడ్డది.

మనం కొత్తగా పొందవలసినది ఏమి లేదు.ప్రస్తుతం మనకు వున్న ఆలోచనలు తొలగించుకుంటే చాలు.

ఆనందము మన స్వభావము.ఆనందము పొందాలి అని అనుకోవడం తప్పు ఏమి లేదు.కాని నిజానికి ఆనందము మనలోనే ఉంటె దానిని బయట వెత్తుకోవడం తప్పు.

దాదాపు మనష్యులు అందరు బాధలో ఉండటానికి కారణం ఆత్మ-జ్ఞానము పొందక పోవడమే.

మెలుకువతో ఉన్న మనిషి తాను గాడ నిద్రలో ఉన్నపుడు ఏమి అయ్యిందో తెలీదు అంటాడు.ఇప్పుడు పక్కన ఉన్న వస్తువులు చూసిన తరువాత తాను బతికే ఉన్నటు అనుకుంటాడు,కాని గాడ నిద్రలో మాత్రం వస్తువులు వుండవు మరియు చూసేవారు కూడా వుండరు.కాని ఇలాంటి మాటలు మెలుకువలో ఉన్నపుడు చెప్పే మనిషి గాడ నిద్రలో కూడా ఉన్నాడు.రెండు స్తితులకి తేడ ఏంటి?

"అహంకారము" అనేది గాడ నిద్రలో నుంచి మెలుకువలో వచ్చినప్పుడు వస్తుంది. నిజానికి ఆత్మ ఎప్పుడు ఒక్కటే,మారనది.

మనకి మనం మేలు చేసుకోవకుండా ప్రపంచమునకు మేలు చేద్దాము అని అనుకోవడం ఎలా ఉంది అంటె "రాళ్ళ మీద ,ముళ్ళ మీద నడవటం ఇబ్బంది గా ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచము మొత్తం తోలుతో కప్పుదాము" అని అన్నట్టు ఉంది.

పరమాత్మ యొక్క తత్వమే ఆనందముగా ఉండటం.ఆనందము,పరమాత్మ రెండు వేరు కాదు.ఈ ప్రపంచంలో ఏ వస్తువులోను మనకి నిజమయిన ఆనందం రాదు.మన కోరికలు సఫలం అయినప్పుడు మన మనస్సు ఆత్మలోకి వెళ్లి ఆనందము తెచ్చుకుంటుంది.ఇలా మన మనస్సు ఆత్మ నుంచి వెళ్లి వస్తూ ఉంటుంది.చెట్టు నీడ కింద చాల హాయిగా ఉంటుంది;బయట ఎండగా ఉంటుంది.ఎండలో నుంచి చెట్టు నీడకి వచ్చిన వాడికి చాల ఆహ్లాదకరంగా ఉంటుంది.ఇలా తరుచు బయటికి వెళ్లి మళ్ళి చెట్టు నీడకి వచ్చేవాడు అవివేకి.తెలివి గలవాడు ఎప్పుడు చెట్టు నీడ లోనే ఉంటాడు.వాస్తవానికి ప్రపంచం అనగా మన ఆలోచన మాత్రమే.ఆలోచనలు లేన్నపుడు ప్రపంచము ఉండదు,అప్పుడు మన మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది;తిరిగి ఆలోచనలు మొదలు అయినప్పుడు మన మనస్సు బాధ పడుతుంది. ఇది మనం రోజు అనుభవిస్తాము.గాడ నిద్రలో చాల సంతోషంగా ఉంటాము అప్పుడు ఈ ప్రపంచము ఉండదు.

మనం కొత్తగా తెలుసుకునేది ఏమి లేదు.తెలుసు కోవడానికి ఏమి ఉంది? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది.ఆత్మ-జ్ఞానముతో మనం కొత్తగా పొందేది ఏమి లేదు.మన యొక్క సంస్కారములు విడిచిపెడితే సరిపోతుంది.సంస్కారములు విడిచిపెడితే మిగిలేది పవిత్రమయిన ఆత్మ ఒక్కటే.

పరిపూర్ణం లేని జ్ఞానము మనస్సుకి సంబందించినది.ఉదాహరమునకు ఒక సైంటిస్ట్ ని తీసుకోండి.భూమి గుండ్రముగా ఉంటుంది అని ఎంతో కష్టబడి నిరూపిస్తాడు.కాని నిజానికి మన గాడ నిద్రలో మనకి భూమి గుండ్రముగా వుంటే ఏంటి లేకపోతె ఏమిటి
చెప్పండి? అందుకే పరిపూర్ణం కలిగిన జ్ఞానము మనస్సుకి సంబందించినది కాదు.మన ఆత్మ-జ్ఞానమే పరిపూర్ణం కలిగిన జ్ఞానము.

Source: http://indiaspirituality.blogspot.com/2008/02/quotes-by-sri-ramana-maharshi.html

1 comments: